Saturday, February 22, 2025

ఆచి తూచి బ్యాటింగ్ చేస్తున్న సౌతాఫ్రికా

- Advertisement -
- Advertisement -

టీమిండియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో సౌతాఫ్రికా ఆటగాళ్లు ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నారు. స్కోరు 11 పరుగుల వద్ద ఉన్నప్పుడు నాలుగో ఓవర్లో మార్క్ రామ్ (5) అవుట్ కావడంతో అప్రమత్తమైన సౌతాఫ్రికా, మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడింది. 25 ఓవర్లు పూర్తయ్యేసరికి మరో వికెట్ కోల్పోకుండా 95 పరుగులు చేసింది. క్రీజులో ఎల్గార్ 61 పరుగులతోను, జోర్జి 23 పరుగులతోనూ ఆడుతున్నారు. అంతకుముందు టీమిండియా 245 పరుగులకు ఆలౌట్ అయింది. కెఎల్ రాహుల్ ఒక్కడే 101 పరుగులు చేశాడు.   కోహ్లీతో సహా ఎవరూ కనీసం 50 పరుగుల మార్క్ ను కూడా దాటలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో రబడా ఐదు వికెట్లు తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News