గెబెహ్రా : సౌతాఫ్రికాతో జరిగిన రెండో టి20లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 19.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (0), శుభ్‌మన్ గిల్ (0)లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. దీంతో ఆరు పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ సూర్యకుమార్ యా దవ్, తిలక్‌వర్మలు ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు.
ఇద్ద రు సౌతాఫ్రికా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరు ను ముందుకు నడిపించారు. ధాటిగా ఆడిన తిలక్‌వర్మ 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 29 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన రింకు సింగ్‌తో కలిసి సూర్యకుమార్ మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కెప్టె న్సీ ఇన్నింగ్స్ ఆడిన సూర్య ఐదు ఫోర్లు, 3 సిక్సర్లతో 36 బంతుల్లోనే 56 పరుగులు చేశాడు. ఇక రింకు సింగ్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. చెలరేగి ఆడిన రింకు 39 బంతుల్లోనే 9 ఫోర్లు, రెండు సిక్సర్లతో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.