Tuesday, November 19, 2024

నేటి నుంచి సౌతాఫ్రికా ,భారత్ రెండో టెస్టు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

కేఫ్‌టౌన్ : సొంత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమితో వన్డే వరల్డ్ కప్ చేజేతులా చేజార్చుకున్న రోహిత్ సేన ఇప్పడు వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ టైటిల్‌పై కన్నెశాడు. అందులో భాగంగా సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు సిరీస్‌లో అడుగు పెట్టారు. అయితే తొలి టెస్టులోనే భారత్ షాక్ తగిలింది. సఫారీల చేతిలో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలై చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ మినహా అందరూ బ్యాట్లెత్తెశారు. దీంతో ఇక బుధవారం నుంచి ఫ్రారంభం కానున్న రెండో టెస్టుపై కన్నెసింది రోహిత్ సేన. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ 11 సమయం చేయాలనే పట్టు దలతో కనిపిస్తుంది. ఇక, విరాట్ కోహ్లి భారీ షాట్లతో ప్రాక్టీస్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ బౌన్సర్లతో సాధన చేశాడు. అయితే కోహ్లి, రాహుల్‌కు ఫిట్‌గానే కనిపిస్తున్నా మిగిలిన వారి నుంచి సహకారం లభించట్లేదు. రోహిత్ శర్శ, యశస్వీ జైశ్వాల్, శుభ్‌మన్ గిల్ దారుణంగా విఫలమవుతున్నారు.

ఈ నేపథ్యంలో సెలక్టర్లపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అజింక్య రహానె, పుజారా జట్టులోకి తీసుకురావాలని డిమాండ్స్ వచ్చాయి. కాగా, రెండో టెస్టులో విజయం సాధించాలంటే యువ ప్లేయర్లతో పాటు కెప్టెన్ రోహిత్ కూడా కీలక ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంది. ఇక బౌలింగ్‌లో బుమ్రా మినహా ఎవరూ రాణించట్లేదు. షమి లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. బుమ్రాకు సిరాజ్ కాస్త సహకారం ఇస్తున్నా, పూర్తిస్థాయి సామర్థ్యంతో బౌలింగ్ చేయట్లేదు. కొత్త కుర్రాడు ప్రసిధ్ కృష్ణ తేలిపోయాడు. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో ముకేశ్ కుమార్‌ను తీసుకునే అవకాశం ఉంది. అలాగే శార్దూల్ ఠాకూర్‌కు మరో ఛాన్స్ ఇవ్వాలని భారత మేనేజ్మెంట్ ఆలోచిస్తుంది. ఇక, స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కోసం రవిచంద్రన్ అశ్విన్ తన స్థానాన్ని త్యాగం చేసే అవకాశాలు ఉన్నాయి. జడేజా ఏడో స్థానంలో విలువైన పరుగులు చేయగలిగే జడేజా వైపే రోహిత్, రాహుల్ ద్రవిడ్ మొగ్గు చూపనున్నారు.

బ్యాటర్లు రాణించాల్సిందే..
ఇక తొలి టెస్టులో భారత బ్యాటింగ్ లైనప్ తేలిపోయింది. ఎవరూ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. కెప్టెన్ రోహిత్‌తో పాటు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, జడేజా, అశ్విన్ సయితం బ్యాట్లెత్తేశారు. అయితే ఈ టెస్టులో చిన్న మార్పుతో బరిలోకి దిగనున్నట్లు కనిపిస్తోంది భారత్. అశ్విన్ స్థానంలో జడేజాను అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్‌లో రాణించేందే తుది జట్టులోకి తీసుకోకున్నారు. ఇక వీరితో పాటు మిడిలార్డర్స్ రాణించడం కీలకం. ఇక మొదటి టెస్టులో భారత్‌కు శుభారంభం దక్కలేదు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు ఆచీతూచి బ్యాటింగ్ చేయవలసిన పరిస్థితి. రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రాణిస్తే, వన్ డౌన్‌లో వచ్చే మొన్నటిలా బ్యాటి ఝలిపిస్తే, వీరికి తోటు సెంచరీ వీరుడు రాహుల్ సయితం ఈ టెస్టులో మరోసారి బ్యాట్‌కు పని చేప్తే భారత్‌కు గెలుపు ఖాయమనే చెప్పొచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News