Thursday, December 26, 2024

అసలైన పరీక్ష టెస్టుల్లోనే

- Advertisement -
- Advertisement -

సఫారీతో పోరు తేలికేం కాదు

మన తెలంగాణ/క్రీడా విభాగం : సౌతాఫ్రికాతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ టీమిండియాకు సవాల్ వంటిదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతోంది. దక్షిణాఫ్రికా లో పర్యటిస్తున్న భారత్ మూడు ఫార్మాట్‌లలో ఆడుతోంది. ఇప్పటికే టి20 సిరీస్ ఆరంభమైంది. ఇది ముగిసిన వెంటనే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతుంది. ఆ తర్వాతే అసలైన టెస్టు సమరానికి తెరలేవనుంది. టి20, వన్డే సిరీస్‌లకు దూరంగా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల్లో బరిలోకి దిగనున్నాడు. అతని సారథ్యంలోనే భారత్ టెస్టులు ఆడనుంది.

సౌతాఫ్రికా గడ్డపై భారత్‌కు టెస్టుల్లో అంతంత మాత్రమే రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సౌతాఫ్రికాలో టీమిండియా టెస్టు సిరీస్‌ను గెలవలేదు. ఈసారి ఎలాగైనా ఆ రికార్డును చెరిపేయాలనే లక్షంతో భారత్‌కు పోరుకు సిద్ధమవుతోంది. కొంతకాలం గా టెస్టుల్లో టీమిండియా నిలకడైన విజయా లు సాధిస్తోంది. ఇదే జోరును సౌతాఫ్రికాలోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. అయితే సొంత గడ్డపై టెస్టుల్లో సఫారీలకు అద్భుత రికార్డు ఉన్న విషయం మరువకూడదు. భారత్‌తో అయితే సఫారీలదే స్పష్టమైన ఆధిక్యం అనడంలో ఎలాంటి సందేహం లేదు. బౌన్స్ సహకరించే పిచ్‌లపై సౌతాఫ్రికా నిలకడైన విజయాలు సాధిస్తూ వస్తోంది.

గతంలో పలు సిరీస్‌లలో భారత్‌ను ఓడించిన దక్షిణాఫ్రికాకు ఉంది. ఈసా రి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే లక్షంతో కనిపిస్తోంది. టెస్టులకు ఆతిథ్యం ఇస్తున్న సెంచూరియన్, కేప్‌టౌన్‌లలో సౌతాఫ్రికాకు మంచి పట్టు ఉంది. ఈసారి కూడా ఆ ఆధిపత్యాన్ని కాపాడుకోవాలనే లక్షంతో పోరుకు సిద్ధమైంది. డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్‌లో తొలి టెస్టు జరుగనుంది. రెండో టెస్టు వచ్చే ఏడాది జనవరి మూడు నుంచి కేప్‌టౌన్‌లోని న్యూ లాండ్స్ మైదానంలో జరుగుతుంది. ఈ రెండు మ్యాచ్‌లు కూడా హోరాహోరీగా సాగే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఇటీవల కాలం లో సొంతగడ్డపైనే కాకుండా విదేశాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న టీమిండియా ను కూడా తక్కువ అంచనా వేయలేం. రోహి త్ శర్మ కెప్టెన్సీ కూడా జట్టుకు సానుకూల అంశంగా చెప్పాలి. విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, జడేజా, అశ్విన్, రుతురాజ్, యశస్విలతో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక షమి, బుమ్రా, సిరాజ్, అశ్విన్, జడేజాలతో బౌలింగ్ విభా గం కూడా బాగానే కనిపిస్తోంది. ఇలాంటి స్థితిలో భారత్ కూడా భారీ ఆశలతో పోరుకు సిద్ధమైంది. కానీ, బలమైన సౌతాఫ్రికాను వారి సొంత గడ్డపై ఓడించడం మాత్రం రోహిత్ సేనకు అంత సులువు కాదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News