Friday, December 20, 2024

హాకీ ప్రపంచకప్ లో భారత్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ప్రపంచకప్ హాకీలో ఆతిథ్య భారత్ శుభారంభం చేసింది. శుక్రవారం రూర్కేలాలోని బిర్సాముండా స్టేడియంలో స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 20 తేడాతో ఘన విజయం సాధించింది. ఆరంభం నుంచే భారత్ దూకుడుగా ఆడింది. ఆట 12వ నిమిషంలోనే వైస్ కెప్టెన్ అమిత్ రోహిదాస్ భారత్‌కు తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత భారత్ మరింత చెలరేగి ఆడింది. 26వ నిమిషంలో హార్దిక్ సింగ్ భారత్‌కు రెండో గోల్ సాధించి పెట్టాడు. దీంతో ప్రథమార్ధం ముగిసే సమయానికి భారత్ 20 ఆధిక్యంలో నిలిచింది. అయితే ద్వితీయార్ధంలో స్పెయిన్ ఎటాకింగ్ గేమ్ ఆడింది.

పదేపదే భారత్ గోల్ పోస్ట్ వైపు దాడులు చేసింది. అయితే గోల్స్ సాధించడంలో మాత్రం విఫలమైంది. కాగా, చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన భారత్ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో భారత్ 3 పాయింట్లను సాధించింది. ఇక శుక్రవారం జరిగిన ఇతర పోటీల్లో ఇంగ్లండ్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా జట్లు విజయం సాధించాయి. ఇంగ్లండ్ 50 తేడాతో వేల్స్‌ను ఓడించింది. ఇక హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 10 తేడాతో సౌతాఫ్రికాపై విజయం సాధించింది. కాగా, ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 80 భారీ తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఒడిశా వేదికగా జరుగుతున్న ఈ వరల్డ్‌కప్‌లో మొత్తం 16 జట్లు బరిలోకి దిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News