న్యూయార్క్: కెనడా, పాకిస్థాన్ లాంటి పెద్ద జట్టు ఓడించి సూపర్-8లోకి అమెరికా జట్టు దూసుకెళ్తోంది. గ్రూప్ ఎలో భారత్‌తో సమానంగా అమెరికాకు నాలుగు పాయింట్లు ఉన్నాయి. ఇవాళ్ల భారత్‌తో యుఎస్‌ఎ ఆడనుంది. ఈ మ్యాచ్ లో మినీ ఇండియా వర్సెస్ ఇండియా ఆడుతున్నట్టు ఉంటుందని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అమెరికా జట్టులో దాదాపుగా సగం మంది ఆటగాళ్లు భారత సంతతి వాళ్లే ఉన్నారు. ఈ సందర్భంగా అమెరికా ప్లేయర్ ఆరోన్ జోన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రతి మ్యాచ్ ఆడిన విధంగానే భారత్‌తోనూ నిర్భయంగా ఆడుతామని స్పష్టం చేశారు. భారత్‌కు గట్టిపోటీనివ్వడంతో పాటు విజయం సాధించడం కోసం శాయశక్తుల కృషి చేస్తామని తెలిపారు. భారత జట్టు నుంచి ఏ ఆటగాడితో ప్రమాదం ఉందని చెప్పమంటే సమాధానం కష్టమేనని, అందరి ఆటతీరు అద్భుతంగా ఉంటుందని, బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కొవడం కష్టమేనని జోన్స్ పేర్కొన్నారు. న్యూయార్క్ పిచ్ ఎలా స్పందిస్తుందో ఇప్పుడు చెప్పలేమన్నారు.