Friday, April 4, 2025

టీమిండియాకు భారీ ఆధిక్యం

- Advertisement -
- Advertisement -

డొమినికా: వెస్టిండీస్‌తో జరుగుతున్న టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించింది. శుక్రవారం మూడో రోజు భోజన విరామ సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 400 పరుగులు చేసింది. దీంతో భారత్ ఆధిక్యం ఇప్పటికే 250 పరుగులకు చేరుకుంది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలు శుక్రవారం మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన యశస్వి జైస్వాల్ 387 బంతుల్లో ఒక సిక్సర్, మరో 16 ఫోర్లతో 171 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కోహ్లితో కలిసి మూడో వికెట్‌కు 350 పరుగులు జోడించాడు. మరోవైపు విరాట్ కోహ్లి ఐదు ఫోర్లతో 72 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అతనికి రవీంద్ర జడేజా 21 (బ్యాటింగ్) అండగా నిలిచాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News