Monday, December 23, 2024

సిరీస్‌పై టీమిండియా కన్ను

- Advertisement -
- Advertisement -

బార్బడాస్: వెస్టిండీస్‌తో శనివారం జరిగే రెండో వన్డేకు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. తొలి వన్డేలో గెలిచిన భారత్ ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ 144 పరుగులకే కుప్పకూలింది.

కుల్దీప్ యాదవ్ అసాధారణ బౌలింగ్‌తో ఆతిథ్య టీమ్ ఇన్నింగ్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశాడు. అయితే టీమిండియా కూడా బ్యాటింగ్‌లో తడబడింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు తీవ్రంగా కష్టపడింది. పిచ్ బౌలింగ్ అనుకూలంగా ఉండడంతో ప్రతి పరుగు కోసం బ్యాటర్లు కష్టపడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ కూడా బ్రిడ్జ్‌టౌన్‌లో జరుగుతుండడంతో బ్యాటర్లకు మరోసారి ఇబ్బందులు ఖాయంగా కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News