Wednesday, January 22, 2025

భారత్‌-విండీస్ వన్డేకు వరుణుడి ఆటంకం

- Advertisement -
- Advertisement -

బార్బడోస్: భారత్‌ వెస్టిండీస్ మధ్య శనివారం ఇక్కడ జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌కి అడుగడుగునా వరుణుడు అడ్డు పడుతున్నాడు. చివరగా వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి భారత్ 8 వికెట్ల నష్టానికి167 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన విండీస్ బౌలింగ్‌ను ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు లేకుండానే బరిలోకి దిగిన జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. వర్షం తరచూ వస్తుండడంతో మ్యాచ్ పూర్తిగా జరుగుతుందా లేదా అనేది కూడా అనుమానంగా మారింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే భారత్ తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ రద్దయితే చివరి మ్యాచ్ కీలకం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News