Saturday, November 23, 2024

రేపటి నుంచి విండీస్‌తో తొలి టెస్టు

- Advertisement -
- Advertisement -

డొమినికా: భారత్‌-వెస్టిండీస్ జట్ల మధ్య బుధవారం నుంచి తొలి టెస్టు మ్యాచ్ జరుగనుంది. డొమినికాలోని విన్‌సర్ పార్క్ గ్రౌండ్ ఈ మ్యాచ్‌కు వేదికగా నిలువనుంది. భారత్ సీనియర్‌జూనియర్ ఆటగాళ్ల కలయికతో బరిలోకి దిగుతోంది. విండీస్‌లో మాత్రం చాలా వరకు కొత్త ముఖాలే ఉన్నాయి. భారత్‌కు రోహిత్ శర్మ, విండీస్‌కు క్రెగ్ బ్రాత్‌వైట్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. భారత్ తరఫున రోహిత్, శుభ్‌మన్ గిల్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశాలున్నాయి.

యువ ఆటగాడు యశస్వి జైస్వాల్, సీనియర్లు విరాట్ కోహ్లి, అజింక్య రహానెలకు తుది జట్టులో ఛాన్స్ ఖాయంగా కనిపిస్తోంది. రవీంద్ర జడేజా కూడా తుది జట్టులో ఉండడం ఖాయం. అయితే రవిచంద్రన్‌కు ఛాన్స్ ఇస్తారా లేదా అనేది సందేహంగా మారింది. అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను ఆడించినా ఆశ్చర్యం లేదు. సిరాజ్, నవ్‌దీప్ సైనీ, ఉనద్కట్‌లకు తుది జట్టులో స్థానం లభించే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి సీనియర్లు కోహ్లి, రహానెలపైనే నిలిచింది. వీరు ఎలా ఆడతారనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. కాగా వికెట్ కీపర్ స్థానం కోసం ఇషాన్ కిషన్, శ్రీకర్ భరత్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వీరిలో ఎవరినీ తీసుకోవాలనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News