Saturday, December 21, 2024

తక్కువ అంచనా వేయలేం..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/క్రీడా విభాగం : వెస్టిండీస్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ టీమిండియాకు సవాల్ వంటిదేనని చెప్పాలి. కొంత కాలంగా విండీస్‌తో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత్ వరుస విజయాలు సాధిస్తున్నా ఈసారి మాత్రం గెలుపు అంత తేలికకాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఆతిథ్య వెస్టిండీస్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆ జట్టు సమతూకంగానే ఉంది.

అయితే నిలకడలేమీ విండీస్‌కు అతి పెద్ద సమస్యగా మారింది. సమష్టిగా రాణించడంలో జట్టు తరచూ వైఫల్యం చవిచూస్తోంది. ఇదే కరీబియన్ జట్టు పతనానికి ముఖ్య కారణంగా తయారైంది. ఈ లోపాన్ని సరిదిద్దు కోవడంలో విండీస్ బోర్డు పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. ఇక ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఎంత వరకు పోటీ ఇస్తుందో బరిలోకి దిగితేనే తెలుస్తోంది. కెప్టెన్ బ్రాత్‌వైట్, బ్లాక్‌వుడ్, త్యాగ్‌నారాయణ్ చంద్రపాల్, జోషువా, జేసన్ హోల్డర్, కార్న్‌వాల్, కేమర్ రోచ్, అల్జరీ జోసెఫ్ వంటి ప్రతిభావంతులు జట్టులో ఉన్నారు. దీంతో భారత్‌కు గట్టి పోటీ ఎదురైనా ఆశ్చర్యం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News