Thursday, January 23, 2025

ఇక క్లీన్‌స్వీప్‌పై టీమిండియా కన్ను

- Advertisement -
- Advertisement -

india vs zimbabwe 3nd odi match

రేపు జింబాబ్వేతో చివరి వన్డే

హరారే: ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా సోమవారం జింబాబ్వేతో జరిగే మూడో వన్డేకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనే పట్టుదలతో భారత్ కనిపిస్తోంది. ఇక ఇప్పటికే వరుసగా రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడిన ఆతిథ్య జింబాబ్వే కనీసం ఆఖరి పోరులో నైనా గెలిచి కాస్తయినా పరువును కాపాడుకోవాలని భావిస్తోంది. అయితే వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాను ఓడించడం జింబాబ్వేకు అనుకున్నం తేలిక కాదనే చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్న భారత్ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఈ మ్యాచ్‌లో రిజర్వ్‌బెంచ్ ఆటగాళ్లను బరిలోకి దించే అవకాశాలున్నాయి. కాగా, రెండో వన్డేలో విఫలమైన కెప్టెన్ కెఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాలనే పట్టుదలతో ఉన్నాడు.

రానున్న ఆసియా కప్ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో రాణించడం ద్వారా ఫామ్‌ను అందుకోవాలని భావిస్తున్నాడు. గాయం వల్ల చాలా కాలంగా రాహుల్ జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆడిన తొలి మ్యాచ్‌లో విఫలమయ్యాడు. కానీ మూడో వన్డేలో రాణించడం ద్వారా మళ్లీ గాడిలో పడాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్‌లు ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసివచ్చే అంశంగా చెప్పాలి. ఈ మ్యాచ్‌లో కూడా జట్టు వీరిపై భారీ ఆశలు పెట్టుకుంది. కాగా, రెండో వన్డేలో విఫలమైన యువ ఆటగాడు ఇషాన్ కిషన్ ఈసారి బ్యాట్‌ను ఝులిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. దీపక్ హుడా, సంజు శాంసన్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. శార్దూల్, సిరాజ్, దీపక్, అక్షర్, కుల్దీప్ తదితరులతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే ఉన్న విషయం తెలిసిందే. తొలి రెండు మ్యాచుల్లో బౌలర్లు అద్భుతంగా రాణించారు. రెండు సార్లు కూడా జింబాబ్వేను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. ఇలాంటి స్థితిలో ఈ మ్యాచ్‌లో కూడా భారత బౌలర్లతో జింబాబ్వే బౌలర్లకు ప్రమాదం పొంచి ఉంది. ఈ సవాల్‌ను జింబాబ్వే బ్యాటర్లు ఎంత వరకు తట్టుకుంటారో చెప్పలేం.

పరువు కోసం..
మరోవైపు ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన జింబాబ్వే కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి కాస్తయిన ఊరట పొందాలని తహతహలాడుతోంది. అయితే బ్యాటింగ్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. రెండు మ్యాచుల్లో కూడా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఓపెనర్లు ఇన్నొసెంట్ కయా, కైటానో, స్టార్ బ్యాటర్లు మధెవెర్, సికందర్ రజా రెండు మ్యాచుల్లోనూ నిరాశ పరిచారు. కనీసం ఈసారైనా వీరు మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సిన అవసరం ఉంది. అప్పుడే జింబాబ్వేకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. లేకుంటే హ్యాట్రిక్ పరాజయం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News