Friday, April 4, 2025

ఐర్లాండ్‌ తో రెండో వన్డే: శతక్కొట్టిన జెమీమా రోడ్రిగ్స్‌.. భారత్ 370/5

- Advertisement -
- Advertisement -

మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా రాజ్ కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో ఐర్లాండ్‌ మహిళల జట్టుతో భారత మహిళల జట్టు తలపడుతోంది. ఈ మ్యాచల్ లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్‌(102) శతకంతో చెలరేగింది. కెరీర్ లో తొలి వన్డే శతకాన్ని నమోదు చేసింది. అలాగే, ఓపెనర్లు స్మృతి మంధాన (73), ప్రతీకా రావల్ (67)లతోపాటు హర్లీన్‌ డియోల్‌(89) అర్ధ శతకాలతో రాణించారు. దీంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది.కాగా, ఇక, ఐర్లాండ్‌ బౌలర్లలో ఓర్లా 2, కెల్లీ 2, డెంప్సీ ఒక వికెట్‌ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News