Friday, December 20, 2024

మసాలాలపై దేశవ్యాప్త తనిఖీలు

- Advertisement -
- Advertisement -

ఎవరెస్టు, ఎండిహెచ్ వంటి పలురకాల మసాలా సుగంధ ద్రవ్యాలపై దేశవ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నారు. పలు చోట్ల భారతీయ కంపెనీల ఈ మసాల ప్యాకెట్ల తనిఖీలు, పరీక్షలు ముమ్మరం చేస్తున్నట్లు ఆహార భద్రతప్రమాణాల భారత సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) గురువారం తెలిపింది. ఈ మసాలాలకు రంగు కోసం వాడే పదార్థాలు రసాయనికం అని, ఇది క్యాన్సర్ కారకం అని వార్తలు వెలువడటంతో ఇప్పటికే హాంగ్‌కాంగ్, సింగపూర్, మలేసియా ఇతర దేశాలలో వీటి అమ్మకాలపై నియంత్రణ విధించారు. తదుపరి పరీక్షలు ముగిసే వరకూ వీటిపై నిషేధం ప్రకటించారు. ఈ కంపెనీల ఉత్పత్తులలో ఎధైలిన్ ఆక్సైడ్ రంగరించుకుని ఉంటుంది. ఇది మానవ వినియోగానికి ప్రమాదకరం . ఎక్కువ కాలం తీసుకుంటే ప్రమామైన క్యాన్సర్ సోకవచ్చునని హెచ్చరికలు వెలువడ్డాయి. ఇప్పుడు విదేశాలలోనే కాకుండా ఈ మసాలాపై దేశంలోని పలు నగరాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారని ఆహార ప్రమాణాల సంస్థ తెలిపింది.

మసాలా ప్యాకెట్ల విక్రమాలలో ఎవరెస్టు, ఎండిహెచ్ రెండు విశేష ఆదరణ పొందాయి. ఇథేలిన్ ఆక్సైడ్ ద్రావక వాడకాన్ని భారతదేశంలో నిషేధించారు. మసాలా ప్యాకెట్లలో తనిఖీల దశలో ఈ నిషేధిత పదార్థపు ఆనవాళ్లు ఉంటే వెంటనే సంబంధిత సరుకుల స్వాధీనం తరువాతి దశలో చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు. సుగంధ మసాలా సరుకుల తయారీ , ఎగుమతులు, వాడకాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే మసాలాలు అమెరికా సహా పలు దేశాలలో ఇష్టపడి కొంటారు. ఇక మనదేశంలో ఈ ప్యాకెట్లభరిత మసాలాల విక్రయాలకు డిమాండ్ ఉంది. 2022లోనే ఈ ఉత్పత్తుల అమ్మకాలు దేశీయ మార్కెట్‌లో ఏకంగా రూ 87,102 కోట్ల వరకూ సాగాయి. జియాన్ మార్కెట్ రిసర్చ్ సంస్థ ఈ విషయం తెలిపింది. ఎండిహెచ్, ఎవరెస్టు కాకుండా మధుసూధన్ మసాలా, ఎన్‌హెచ్‌సి ఫుడ్స్, టాటా కంపెనీ మసాలా , ఐటిసి మసాలా బ్రాండ్లు కూడా విపరీతంగా అమ్ముడుపోతాయి. భారతీయులకు ఉండే రుచికరమైన మసాల వంటకాల ఇష్టాన్ని ఈ విషయం స్పష్టం చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News