కోల్ కతా: ప్రధాని నరేంద్ర మోడీ ‘అతి శయోక్తి మాస్టర్’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం పేర్కొన్నారు. ఆయన అంకగణిత అనివార్యతను హామీగా మార్చారని అన్నారు. ఎవరు ప్రధాని అయినా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందన్నారు. జనాభా సైజును బట్టే ఈ ఫీట్ ను భారత్ సాధిస్తుందన్నారు. ఇందులో ‘మ్యాజిక్ ’ ఏమి లేదన్నారు.
వరల్ఢ్ ఎకనామీ ర్యాంకింగ్స్ 2024 ప్రకారం భారత జిడిపి 4.8 ట్రిలియన్ అమెరికా డాలర్లు. అమెరికా, చైనా, జపాన్ మన దేశం కన్నా ముందున్నాయి. అంతేకాక జర్మనీ తో సమానంగా మన దేశం జిడిపి ఉంది. ర్యాంకులలో ఫ్రాన్స్, ఇటలీ, బ్రెజిల్, కెనడా, యూకె వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు భారత్ కన్నా వెనుకబడి ఉన్నాయి.
చిదంబరం నాలుగు సార్లు కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఓ దేశ జిడిపి ప్రకారం ప్రజల సౌభాగ్యాన్ని గణించలేమని ఆయన అన్నారు. తలసరి ఆదాయమే నిజమైన సూచిక అని కూడా అన్నారు. ‘‘ నా దృష్టిలో జిడిపి కన్నా తలసరి ఆదాయమే సౌభాగ్యానికి అసలైన కొలమానం. కానీ ఈ కొలమానం ర్యాంకు విషయంలో భారత్ చాలా అట్టడుగున ఉంది.