ముంబై : పూర్తిగా ఇథనాల్‌తోనే నడిచే కొత్త వాహనాలు త్వరలో వస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఆదివారం నాగపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవలనే తాను మెర్సెడెస్ బెంజ్ కంపెనీ ఛైర్మన్‌ను కలుసుకున్నానని, ఆ సంస్థ విద్యుత్ వాహనాన్ని ప్రారంభించిందని చెప్పారు. భవిష్యత్‌లో విద్యుత్‌తో నడిచే వాహనాలనే తయారు చేస్తామని ఆ సంస్థ ఛైర్మన్ తనకు చెప్పారని గడ్కరీ గుర్తు చేసుకున్నారు.
బజాజ్, టివిఎస్, హీరో స్కూటర్లు కూడా నూటికి నూరు శాతం ఇథనాల్‌తో నడిచే వాహనాలనే తీసుకు వస్తాయని చెప్పారు. ఆగస్టులో టొయొటా కంపెనీకి చెందిన కేమ్రీ కారును తాను ప్రారంభిస్తానని, అది పూర్తిగా ఇథనాల్‌పైనే నడుస్తుందని , 40 శాతం విద్యుత్‌ను అది ఉత్పత్తి చేస్తుందని వివరించారు. పెట్రోల్‌తో ఇథనాల్ ధర పోల్చుకుంటే ఇథనాల్ వల్ల 40 శాతం విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి పెట్రోల్ ధర బాగా ఆదా అవుతుందని వివరించారు.