టి20 ప్రపంచకప్‌లో టీమిండియాకే ట్రోఫీ గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయని పలువురు మాజీ క్రికెటర్లు జోస్యం చెబుతున్నారు. ఈ వరల్డ్‌కప్‌లో భారత్ అసాధారణ ఆటతో అలరించిందని, ఫైనల్లోనూ అదే జోరును కొనసాగిస్తుందనే నమ్మకాన్ని సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, హర్భజన్ సింగ్, సౌరవ్ గంగూలీ, సెహ్వాగ్ తదితరులు ధీమా వ్యక్తం చేశారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా సమతూకంగా ఉందని, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి బలమైన జట్లపై వరుస విజయాలు సాధించడంతో జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యిందని వారు పేర్కొంటున్నారు. సమష్టిగా రాణిస్తే సౌతాఫ్రికాను మట్టికరిపించి ట్రోఫీని గెలుచుకోవడం టీమిండియాకు అసాధ్యమేమీ కాదని వారు అభిప్రాయపడ్డారు.
కాగా.. ఈరోజు రాత్రి 8 గంటలకు భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య వరల్డ్‌కప్ ఫైనల్ పోరు జరగనుంది. భారత్ రెండోసారి టి20 వరల్డ్‌కప్ నెగ్గాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది. మరోవైపు తన క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ప్రపంచకప్ సమరంలో ఫైనల్‌కు చేరుకున్న సౌతాఫ్రికా.. తొలి ప్రయత్నంలోనే ట్రోఫీని గెలిచి చరిత్ర సృష్టించాలని భావిస్తోంది.