Saturday, December 21, 2024

తొలి వన్డేలో 10వికెట్ల తేడాతో భారత్ విజయం

- Advertisement -
- Advertisement -

ది ఓవల్ వేదికగా ఆతిథ్య జట్టు ఇంగ్లండ్‌ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో భారత్ ఇంగ్లండ్ జట్టును చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ బ్యాటర్లకు బుమ్రా చుక్కలు చూపించాడు. బెంబేలెత్తించారు. బుమ్రా కేవలం 19 పరుగులే ఇచ్చి 6 వికెట్లు తీసి ఇంగ్లండ్ ను కుప్పకూల్చాడు. బుమ్రాతోపాటు మహమ్మద్ సమీ కూడా 3 వికెట్లతో రాణించాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు 25.2 ఓవర్లలో 110 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన భారత ఓపెనర్లు శిఖర్ ధావన్ (31 నాటౌట్), రోహిత్ శర్మ (76 నాటౌట్)లు 18.4 ఓవర్లలో 114 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

India win by 10 wickets against England in 1st ODI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News