Thursday, January 23, 2025

సిరీస్ మనదే..

- Advertisement -
- Advertisement -

 

మూడో వన్డేలో ఇంగ్లాండ్‌పై భారత్ విజయం
 సెంచరీతో చెలరేగిన రిషబ్, పాండ్య అల్‌రౌండ్ షో

మాంచెస్టర్: మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. రిషభ్ పంత్ అజేయ సెంచరీ, హర్ధిక్ పాండ్యా ఆర్ధ సెంచరీలతో రాణించడంతో కేవలం 42 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి టీమిండియా విజయం సాధించింది. ఆదివారం జరిగిన కీలక మ్యాచ్‌లో టీమిండియా సత్తా చాటింది. ఇంగ్లండ్ ఇచ్చిన 259 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా ఛేధించి 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. 42.1 ఓవర్లలలో 5 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని అందుకుంది. రిషభ్ పంత్ ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. 113 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్‌లతో 125 పరుగులు సాధించి కీలక ఇన్నింగ్స్‌తో రాణించాడు. దీంతో భారత్ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. పంత్ తర్వాత హార్ధిక్ పాండ్యే 71 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇక అంతకుముందు టీమిండియా బౌలర్లు సత్తాచాటారు. ఇంగ్లండ్ జట్టును 259 పరుగులకే కట్టడి చేశారు. హార్దిక్ పాండ్యా (4/24), యుజువేంద్ర చాహల్ (3/60) ఆతిథ్య జట్టును భారీస్కోరు చేయకుండా అడ్డుకున్నారు. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ (60; 80 బంతుల్లో 3స4, 2×6) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్ జేసన్ రాయ్(41; 31 బంతుల్లో 7×4) రాణించాడు. చివర్లో క్రేగ్ ఓవర్టన్ (32; 33 బంతుల్లో 1×4, 1×6), డేవిడ్ విల్లే (18; 15 బంతుల్లో 1×4, 1×6) ఓ మోస్తరు పరుగులు చేశారు. రెండో మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే.

India win by 5 wickets in 3rd ODI against England

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News