Friday, November 15, 2024

తొలి వన్డేలో భారత్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ లో భారత్ బోణి కొట్టింది. భారత్ నిర్దేశించిన 318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 42.1 ఓవర్లలో 251 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీమిండియా 66 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ జానీ బెయిర్ స్టో(94) మెరుపులు మెరిపించాడు. మరో ఓపెనర్ జాన్సన్ రాయ్(46), మోహిన్ అలీ(30)లు మాత్రమే రాణించారు. మిగతా ఆటగాళ్లు విఫలమవ్వడంతో ఇంగ్లండ్ ఓటమిపాలైంది. భారత బౌలర్లలో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న యంగ్ బౌలర్ ప్రసిద్ కృష్ణ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు, శార్దుల్ ఠాకూర్ మూడు వికెట్లు, కృనాల్ పాండ్యా ఒక వికెట్ తీశారు.

అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టానికి 317 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్లలో శిఖర్ ధావన్(98), కెఎల్ రాహుల్(62), కృనాల్ పాండ్యా(58), విరాట్ కోహ్లీ(56)లు అర్థ శతకాలతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ రెండు వికెట్లు పడగొట్టగా బెన్ స్టోక్స్ మూడు వికెట్లు తీశాడు.

India win by 66 Runs in 1st ODI against England

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News