పుణె: మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టుపై టీమిండియా విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 330 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 322 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. దీంతో భారత్ ఇంగ్లండ్ జట్టుపై ఏడు పరుగుల తేడాతో గెలుపొందింది. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లలో డేవిడ్ మలన్(50) అర్ధశతకంతో రాణించగా, బెన్‌స్టోక్స్(35), లియామ్ లివింగ్‌స్టోన్(36)లు పర్వాలేదనిపించారు.ఇక, ఆల్‌రౌండ్ సామ్ కరన్(95 నాటౌట్) అద్భుత అర్థ సెంచరీతో ఇంగ్లండ్ జట్టును విజయం విజయం అంచు వరకు తీసుకెళ్లాడు. ఓ దశలో సామ్ కరన్ దూకుడు చేస్తే ఇంగ్లండ్ జట్టు ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, చివరి రెండు ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ వేసిన హర్దిక్, నటరాజన్ లు సామ్ కరన్ ను కట్టడి చేయడంతో భారత్ గెలుచింది. ఈ విజయంతో భారత్ 2-1తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్ కుమార్ మూడు, నటరాజన్ ఒక వికెట్ తీశారు.
India win by 7 runs in 3rd ODI against England