హాంగ్‌జౌ: ఆసియా క్రీడల్లో భాగంగా జరుగుతున్న సెయిలింగ్ క్రీడల్లో భారత ఆటగాళ్ల హవా నడుస్తోంది. మంగళవారం సెయిలింగ్ విభాగంలో భారత్‌కు మూడు పతకాలు లభించాయి. మహిళల విభాగంలో నేహా ఠాకూర్ రజతం సాధించింది. ఇక పురుషుల విభాగంలో భారత్‌కు రెండు కాంస్య పతకాలు దక్కాయి. మహిళల విభాగంలో నేహా ఠాకూర్ అద్భుత ప్రతిభతో అలరించింది.
ప్రతికూల వాతావరణంలో పూర్తి ఏకాగ్రతతో రేసును కొనసాగించిన నేహా రెండో స్థానంలో నిలిచి తన ఖాతాలో రజతాన్ని జతచేసుకుంది. మహిళల డింగి ఐసిఎల్‌ఎ4 విభాగంలో నేహా ఠాకూర్ రజతాన్ని దక్కించుకుంది. పురుషుల వైండ్‌సర్ఫర్ ఆర్‌ఎక్స్ విభాగంలో ఇబాదత్ అలీ కాంస్య పతకాన్ని సాధించాడు. ఇబాదత్ అలీ అద్భుత ప్రతిభతో ఆసియా క్రీడల్లో భారత్‌కు పతకం సాధించి పెట్టాడు. మరోవైపు ఐఎల్‌సిఎ విభాగంలో భారత్‌కు చెందిన మరో ఆటగాడు విష్ణు శరవణన్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.