Tuesday, April 8, 2025

సెమీస్‌లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. బుధవారం సౌతాఫ్రికా న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే సెమీ ఫైనల్ విజేతతో భారత్ ఫైనల్లో తలపడుతుంది. తుది పోరు ఆదివారం జరుగుతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా 48.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. మహ్మద్ షమి, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్‌లు భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఆదుకున్న కోహ్లి, శ్రేయస్
ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మరోసారి నిరాశ పరిచాడు. గిల్8 పరుగుల మాత్రమే చేసి ఔటయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 28 పరుగులు చేశాడు. దీంతో భారత్ 43 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌లు తమపై వేసుకున్నారు. ఇద్దరు ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా సింగిల్స్‌తో స్కోరును నడిపించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ 45 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ కూడా కోహ్లికి సహకారం అందించాడు. అక్షర్ 27 పరుగులు చేశాడు.

మరోవైపు అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లి 98 బంతుల్లో ఐదు ఫోర్లతో 84 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలుపు బాటలో నడిపించారు. రాహుల్ రెండు ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చెలరేగిఆడిన హార్దిక్ 3 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 28 పరుగులు సాధించాడు. దీంతో భారత్ మిగిలిన లాంఛనాన్ని పూర్తి చేసింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన స్టీవ్ స్మిత్ 73 పరుగులు చేశాడు. అలెక్స్ కెరీ 61 పరుగులతో తనవంతు పాత్ర పోషించాడు. ట్రావిస్ హెడ్ 39 పరుగుల చేశాడు. మిగతావారు నిరాశ పరిచారు. భారత బౌలర్లలో షమి మూడు, జడేజా, వరుణ్ రెండేసి వికెట్లను పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News