Sunday, December 22, 2024

ఐర్లాండ్‌పై భారత్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు రెండో విజయం నమోదు చేసింది. మంగళవారం పూల్‌బిలో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 2-0 గోల్స్ తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఇప్పటి వరకు లీగ్ దశలో మూడు మ్యాచ్‌లు ఆడిన భారత్ రెండు విజయాలు, ఒక డ్రాతో నాకౌట్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకుంది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది.

ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి టీమ్‌ను ముప్పుతిప్పలు పెట్టింది. అయితే ఐర్లాండ్ కూడా మెరుగైన ప్రదర్శనతో అలరించింది. భారత్ వంటి బలమైన జట్టుకు గట్టి పోటీ ఇచ్చింది. కానీ పటిష్టమైన భారత డిఫెన్స్ దాటుకుని గోల్స్ సాధించలేక పోయింది. ఇక భారత్ విజయంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. హర్మన్‌ప్రీత్ రెండు గోల్స్ సాధించి జట్టును గెలిపించాడు. భారత్ తన తర్వాతి మ్యాచ్‌లను బెల్జియం, ఆస్ట్రేలియాలతో ఆడనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News