Thursday, November 21, 2024

యువ భారత్ నయా చరిత్ర

- Advertisement -
- Advertisement -

యువ భారత్ నయా చరిత్ర.. చెలరేగిన పంత్, గిల్, రాణించిన పుజారా
ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం, 2-1తో సిరీస్ సొంతం

ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో టీమిండియా మూడు వికెట్ల తేడాతో చారిత్రక విజయం సాధించింది. ఈ గెలుపుతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 21తో సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌కు ఇది వరుసగా రెండో సిరీస్ విజయం కావడ విశేషం. చివరి రోజు విజయానికి కావాల్సిన 324 పరుగులకు టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్, నయా వాల్, మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా, యువ సంచలనం రిషబ్ పంత్ అద్భుత బ్యాటింగ్‌తో భారత్‌కు చారిత్రక విజయం సాధించి పెట్టారు. గాయాల వల్ల పలువురు కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమైన అజింక్య రహానె సారధ్యంలోని భారత యువ జట్టు అసాధారణ పోరాట పటిమతో అసాధారణ విజయా న్ని సొంతం చేసుకుంది.

బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో, చివరి టెస్టులో టీమిండియా మూడు వికెట్ల తేడాతో చారిత్రక విజయం సాధించింది. ఈ గెలుపుతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 21తో సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌కు ఇది వరుసగా రెండో సిరీస్ విజయం కావడ విశేషం. చివరి రోజు విజయానికి కావాల్సిన 324 పరుగులకు టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్, నయా వాల్, మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా, యువ సంచలనం రిషబ్ పంత్ అద్భుత బ్యాటింగ్‌తో భారత్‌కు చారిత్రక విజయం సాధించి పెట్టారు. గాయాల వల్ల పలువురు కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమైన అజింక్య రహానె సారధ్యంలోని భారత యువ జట్టు అసాధారణ పోరాట పటిమతో అసాధారణ విజయాన్ని సొంతం చేసుకుంది. రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లితో సహా, బుమ్రా, రాహుల్, షమి, ఉమేశ్, అశ్విన్, జడేజా, ఇషాంత్, భువనేశ్వర్ వంటి సీనియర్లు లేకుండానే ఆడిన భారత్ సమష్టి పోరాటంతో చారిత్రక విజయం అందుకుంది. టీమిండియా టెస్టు చరిత్రలోనే ఇది చిరస్మరణీయ విజయంగా ఇది చిరకాలం గుర్తుండి పోతుందనడంలో సందేహం లేదు. తొలి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలిన భారత్ ఇలాంటి చారిత్రక ప్రదర్శన చేస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ మెల్‌బోర్న్ మ్యాచ్ నుంచి అసాధారణ పోరాటంతో అలరించిన టీమిండియా చిరస్మరణీయ గెలుపును తన ఖాతాలో వేసుకుంది.
ఆదుకున్న గిల్, పుజారా
క్లిష్టమైన లక్షంతో మంగళవారం చివరి రోజు బ్యాటింగ్‌ను కొనసాగించిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. జట్టును ఆదుకుంటాడని భావించిన సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ(7) నిరాశ పరిచాడు. ఓవర్‌నైట్ స్కోరుకు మూడు పరుగులు మాత్రమే జోడించి కమిన్స్ చేతికి చిక్కాడు. అయితే తర్వాత వచ్చిన మిస్టర్ డిపెండబుల్, నయా వాల్ చటేశ్వర్ పుజారాతో కలిసి యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు కుదురుగా ఆడుతూ స్కోరును ముందుకు నడిపించారు. ఆరంభంలో ఇద్దరు వికెట్‌ను కాపాడుకునేందుకే ప్రాధాన్యత ఇచ్చారు. పుజారా తన మార్క్ డిఫెన్స్‌తో అలరించగా గిల్ అడపాదడపా బౌండరీలతో ముందుకు సాగాడు. లంచ్ విరామ సమయానికి భారత్ స్కోరు 83/1కి చేరింది. ఆ తర్వాత గిల్ దూకుడును పెంచాడు. ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును పరిగెత్తించాడు. చెలరేగి ఆడిన ఆడిన గిల్ 146 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 91 పరుగులు చేసి ఔటయ్యాడు. సెంచరీ దిశగా సాగుతున్న గిల్‌ను లియాన్ పెవిలియన్ బాట పట్టించాడు. అప్పటికే పుజారాతో కలిసి రెండో వికెట్‌కు 114 పరుగులు జోడించాడు. గిల్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ రహానె దూకుడుగా ఆడాడు. ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. కానీ 24 పరుగులు చేసిన రహానెను కమిన్స్ ఔట్ చేశాడు.
పంత్ దూకుడు
ఈ దశలో క్రీజులోకి వచ్చిన యువ వికెట్ కీపర్‌తో కలిసి పుజారా మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తన మార్క్ బ్యాటింగ్‌తో అలరించిన పుజారా అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. పంత్ మాత్రం తనదైన రీతిలో దూకుడును ప్రదర్శించాడు. ఇద్దరు కలిసి జట్టును గెలుపు దిశగా నడిపించారు. టి విరామ సమయానికి భారత్ 183/3తో నిలిచింది. ఇక ఆఖరి సెషన్‌లో టీమిండియాకు విజయం కోసం మరో 144 పరుగులు చేయాల్సి ఉంది. ఇలాంటి స్థితిలో భారత్ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. అంతేగాక కీలక సమయంలో పుజారా కూడా ఔటయ్యాడు. సమన్వయంతో ఆడిన పుజారా 211 బంతుల్లో ఏడు ఫోర్లతో 56 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన యువ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ దూకుడుగా ఆడి ఒత్తిడి లేకుండా చూశాడు. ధాటిగా ఆడిన సుందర్ రెండు ఫోర్లు, సిక్స్‌తో 22 పరుగులు చేశాడు. పంత్ కూడా తన మార్క్ షాట్లతో స్కోరును పరిగెత్తించాడు. చివరి వరకు నాటౌట్‌గా ఉండి భారత్‌కు చారిత్రక విజయం అందించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన పంత్ 138 బంతుల్లో 9 ఫోర్లు, మరో సిక్సర్‌తో అజేయంగా 89 పరుగులు చేసి జట్టుకు సంచలనం విజయం సాధించి పెట్టాడు. పంత్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్‌లో నిలకడగా రాణించిన కమిన్స్‌కు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు లభించింది.

India win Test Series with 2-1 against Australia

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News