Thursday, December 19, 2024

బంగ్లాపై టీమిండియా ఘన విజయం

- Advertisement -
- Advertisement -

చట్టగాంగ్: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 513 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు బంగ్లాను భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ కట్టడి చేశారు. దీంతో బంగ్లాదేశ్ 324 పరుగులకే ఆలౌట్ కాగా, భారత జట్టు 188 పరుగుల తేడాతో  గెలుపొందింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 404 పరుగులు చేయగా, బంగ్గాదేశ్ కేవలం 150 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్  రెండు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసి ఇన్సింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. బంగ్లాదేశ్‌ ముందు 513 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.513 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ రెండో ఇన్సింగ్స్‌లో 324 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News