Sunday, December 22, 2024

క్రికెట్‌లో భారత్‌కు స్వర్ణం

- Advertisement -
- Advertisement -

హాంగ్‌జౌ: ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ టీమ్ స్వర్ణం సాధించింది. శనివారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. దీంతో ఈ క్రీడల్లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన భారత్‌ను నిర్వాహకులు విజేతగా ప్రకటించారు. దీంతో టీమిండియాకు పసిడి పతకం లభించింది. అఫ్గానిస్థాన్ రెండో స్థానంలో నిలిచి రజతాన్ని దక్కించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 18.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం రావడంతో ఆట ముందుకు సాగలేదు. భారీ వర్షం వల్ల మైదానం చిత్తడిగా మారడంతో ఆటను రద్దు చేయక తప్పలేదు. చివరికి టాప్ సీడ్ భారత్‌కు పసిడి పతకాన్ని అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News