- Advertisement -
బెర్లిన్: ప్రపంచ ఆర్చరీ పోటీల్లో భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. బెర్లిన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందని మహిళల కాంపౌండ్ టీమ్ స్వర్ణ పతకం సాధించింది. జ్యోతి సురేఖ, ప్రణీత్ కౌర్, అదితి గోపీచంద్‌లతో కూడిన భారత జట్టు పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్ 235229 తేడాతో మెక్సికోను ఓడించింది. ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైనా చివరి వరకు నిలకడైన ప్రదర్శన చేసిన భారత జట్టు పసిడి పతకాన్ని దక్కించుకుంది. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు టీమ్ విభాగంలో ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం.
- Advertisement -