Sunday, January 19, 2025

భారత మహిళలకు మరో విజయం

- Advertisement -
- Advertisement -

మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత్ వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-0 గోల్స్ తేడాతో చైనాను ఓడించింది. ఆరంభంలో ఇరు జట్లు నువ్వానేనా అన్నట్టు పోరాడాయి. గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించాయి. కానీ గోల్ సాధించడంలో విఫలమయ్యాయి. ద్వితీయార్ధంల మాత్రం భారత్ ఎటాకింగ్ గేమ్‌తో చెలరేగి పోయింది. స్టార్ క్రీడాకారిణి సంగీత కుమారి అద్భుత ఆటతో 32వ నిమిషంలో భారత్‌కు తొలి గోల్‌ను అందించింది. కొద్ది సేపటికే కెప్టెన్ సలీమా జట్టు రెండో గోల్ సాధించి పెట్టింది. ఇక చివర్లో దీపిక మూడో గోల్ నమోదు చేసింది. దీంతో భారత్ 3-0తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. లీగ్ దశలో భారత్‌కు ఇది వరుసగా నాలుగో గెలుపు కావడం విశేషం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News