Thursday, January 23, 2025

టీమిండియా ఘన విజయం

- Advertisement -
- Advertisement -

మిర్‌పూర్ : సుదీర్ఘ విరామం అనంతరం మైదానంలోకి దిగిన భారత మహిళా క్రికెట్ జట్టు సంచలన విజయనాన నమోదు అందుకుంది. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టి20లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 115 పరుగుల లక్ష ఛేదనకు దిగిన హర్మన్ సేన.. కేవలం 16.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే నష్టపోయి 118 పరుగులు చేసి బంగ్లాను చిత్తు చేసింది. సారధి హర్మన్ ప్రీత్ కౌర్ (35 బంతుల్లో 54 నాటౌట్; 6×4, 2×6) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్లుకోగా డాషింగ్ బ్యాటర్ స్మృతి మంధాన(34 బంతుల్లో 38; 5×4) రాణించింది. వీరిద్దరి భాగస్వామ్యం టీమిండియాకు విజయాన్ని అందించింది.

బంగ్లాదేశ్ బౌలర్లలో సుల్తానా ఖాటున్ 2 వికెట్లు దక్కా యి. ఈ విజయంతో భారత్ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో దూసుకెళ్లింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 114 పరుగులు చేసింది. షోర్ణ అక్తర్ (28 నాటౌట్; 2×6) టాప్ స్కోరర్‌గా నిలిచింది. షబనా (23), షత్తి రాణి (22) పరుగులు చేశారు. ఈ ముగ్గురు తప్ప మిగిలిన బ్యాటర్లు ఎవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. దీంతో బంగ్లా అత్యల్ప స్కోరుకే పరిమితం అయ్యింది. ఇక భారత బౌలర్లలో పుజా వస్త్రేకర్, మిన్ను మణి, షఫాలీ వర్మలు తలా ఒక వికెట్ పడగొట్టారు.
అదిలోనే ఎదురుదెబ్బ..
లక్ష ఛేదనకు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. షఫాలీ వర్మ (0) పరుగులేమి చేయకుండానే వెనుదిరిగింది. కాసేపటికే జెమీమా రోడ్రిగ్స్(11) కూడా తక్కువ స్కోరుకే అవుటైంది. దాంతో భారత్ 21 పరుగులకే రెండు కీలక వికెట్లు కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సారధి హర్మన్ ప్రీత్ కౌర్.. ఉప సారధి స్మృతి మంధాన ఆచితూచీ ఆడుతూ మూడో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. అనంరతం సుల్తానా ఖాతున్ బౌలింగ్ వికెట్ల వెనుక కీపర్‌కు దొరికిపోయి స్టంప్ అవుట్ వెనుదిరిగింది స్మృతి మంధాన. అయితే మరో ఎండ్‌లో ఉన్న హర్మన్ ప్రీత్ కౌర్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవడంతో టీమిండియాను విజయతీరాలకు చేర్చింది. కాగా, రెండో టి20 మ్యాచ్ జూలై 11న జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News