Saturday, January 11, 2025

అదరగొట్టిన అమ్మాయిలు

- Advertisement -
- Advertisement -

భారత మహిళల క్రికెట్ జట్టు విజయ దుందుభి మోగిస్తోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సొంతగడ్డపై ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ ప్రతీకా రావల్(83), తేజల్ హసబ్నిస్(53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది మంధాన సేన. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. ఆ జట్టు సారథి గబీ లూయిస్(92) బ్యాట్ ఝలిపించింది. సెంచరీకి 8 పరుగుల దూరంలో ఔటై పెవిలియన్ చేరింది.

లీహ్ పాల్(59) హాఫ్ సెంచరీతో రాణించింది. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా రెండు వికెట్లు, టిటస్ సధు, సయలి, దీప్తి శర్మ తలో వికెట్ పడగొట్టి ఐర్లాండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. అనంతరం లక్ష ఛేదనకు దిగిన భారత జట్టు కేవలం 34.3 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ స్మృతి మంధాన(41) శుభారంభం అందించింది. ఐర్లాండ్ బౌలర్లలో అర్లెనే కెల్లీ ఓ వికెట్ తీయగా.. మాగ్యూరీ మూడు వికెట్లు పడగొట్టింది. ఇటీవలె న్యూజిలాండ్, వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లను గెలుచుకుని జోరు మీదున్న భారత మహిళల జట్టు.. హ్యాట్రిక్ సిరీస్ విజయంపై కన్నేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి భారత్‌లో జరగాల్సి ఉన్న మహిళల వన్డే వరల్డ్‌కప్ ముందు ఈ సిరీస్‌లను టీమిండియా సన్నాహకంగా మారనుంది.

స్మృతి మంధాన నయా రికార్డ్
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 4 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి భారత బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పింది. ఐర్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో ఈ ఫీట్ సాధించింది. ఈ మ్యాచ్‌లో దూకుడుగా ఆడిన స్మృతి మంధాన తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించింది. ఈ క్రమంలోనే వన్డే క్రికెట్‌లో 4 వేల పరుగులు పూర్తి చేసుకుంది. అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో ఈ ఫీట్ సాధించిన 15వ ప్లేయర్‌గా, రెండో భారత బ్యాటర్‌గా మంధాన నిలిచింది. స్మృతి మంధాన కంటే ముందు భారత్ తరఫున మిథాలీ రాజ్ ఈ ఫీట్ సాధించింది. 95 ఇన్నింగ్స్‌ల్లోనే మంధాన ఈ ఫీట్ సాధించడం విశేషం.

ఓవరాల్‌గా అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన మూడో ప్లేయర్‌గా తొలి భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ బెలిండా క్లార్క్ కేవలం 86 ఇన్నింగ్స్‌ల్లోనే 4 వేల పరుగుల మైలు రాయిని చేరుకోగా ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆమె తర్వాత మెగ్ లాన్నింగ్(87 ఇన్నింగ్స్‌లు), స్మృతి మంధాన(95), లారా వోల్వా ర్డ్(96), కరేన్ రోల్టన్(103), సుజీ బీట్స్(105), స్టేఫనీ ట్టేఫనీ, తమ్‌సిన్ బ్యూమౌంట్(110), మిథాలీ రాజ్(112), డెబ్బీ హక్‌లీ(112) కొనసాగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News