Monday, December 23, 2024

భారత మహిళలకు మరో విజయం

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్‌తో సోమవారం జరిగిన నాలుగో టి20 భారత మహిళా క్రికెట్ టీమ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 40 ఆధిక్యాన్ని దక్కించుకుంది. వర్షం వల్ల మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 14 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. అనంతరం లక్ష ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 14 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 68 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. భారత బౌలర్లు ఆరంభం నుంచే అద్భుత బౌలింగ్‌ను కనబరిచారు. కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేస్తూ ఆతిథ్య జట్టు బ్యాటర్లను కట్టడి చేశారు. భారత బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాట్‌ను ఝులిపించలేక పోయారు. పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, రాధా యాదవ్, శోభన, టిటాస్ సాధులు పొదుపుగా బౌలింగ్ చేశారు.

దీంతో బంగ్లాదేశ్ స్కోరు 68 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో శోభన, దీప్తి శర్మ రెండేసి వికెట్లను పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆదుకుంది. ప్రత్యర్థి జట్టు బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న హర్మన్‌ప్రీత్ 26 బంతుల్లో ఐదు ఫోర్లతో 39 పరుగులు చేసింది. వికెట్ కీపర్ రిచా ఘోష్ 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 24 పరుగులు సాధించింది. ఓపెనర్ స్మృతి మంధాన (22), హేమలత (22) తమవంతు పాత్ర పోషించారు. బంగ్లా బౌలర్లలో మారుఫ అక్తర్, రాబియా ఖాన్ రెండేసి వికెట్లను పడగొట్టారు. కాగా, ఈ సిరీస్‌లో భారత్‌కు ఇది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. వరుస విజయాలు సాధించిన భారత్ సిరీస్‌లో 40 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య ఐదో, చివరి టి20 గురువారం జరుగుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News