- Advertisement -
బ్రిస్టోల్ : ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ లో భారత మహిళలు అసాధారణ ఆటతో ఓటమిని తప్పించుకున్నారు. ఫాలోఆన్ ఆడుతూ ఒక దశలో 199 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఓటమి కోరల్లో చిక్కుకున్న భారత్‌ను స్నేహ్ రాణా అసాధారణ బ్యాటింగ్‌తో ఆదుకుంది. తొలుత శిఖా పాండేతో కలిసి స్నేహ్ ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంది. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన శిఖా 50 బంతుల్లో 18 పరుగులు చేసింది. తర్వాత వచ్చిన తానియా భాటియా మారథాన్ ఇన్నింగ్స్ ఆడింది. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న భాటియా 44 పరుగులతో అజేయంగా నిలిచింది. మరోవైపు చారిత్రక ఇన్నిం గ్స్ ఆడిన స్నేహ్ రాణా 80 పరుగులతో నాటౌట్‌గా ఉంది. దీంతో భారత్ 8 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
- Advertisement -