Sunday, December 22, 2024

భారత మహిళల ఘన విజయం

- Advertisement -
- Advertisement -

ముంబై: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20 భారత మహిళలు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళా టీమ్ 19.2 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా 17.4 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మలు అద్భుత బ్యాటింగ్‌తో భారత్‌ను గెలిపించారు. సమన్వయంతో ఆడిన మంధాన 52 బంతుల్లో ఒక సిక్సర్, ఏడు బౌండరీలతో 54 పరుగులు చేసింది.

ధాటిగా బ్యాటింగ్ చేసిన షఫాలీ 44 బంతుల్లో 3 సిక్సర్లు, ఆరు ఫోర్లతో అజేయంగా 64 పరుగులు సాధించింది. అంతకుమందు తొలుత బ్యాటింగ్ చేసిన కంగారూ టీమ్‌ను భారత బౌలర్లు తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. టిటాస్ సాధు 17 పరుగులకే నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చింది. శ్రేయంక పాటిల్, దీప్తి శర్మలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆసీస్ టీమ్‌లో లిచ్‌ఫీల్డ్ (49), ఎలిసె పేరి (37) మాత్రమే రాణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News