Monday, January 20, 2025

నేడు ఆస్ట్రేలియాతో రెండో వన్డే..

- Advertisement -
- Advertisement -

ముంబై: ఆస్ట్రేలియాతో శనివారం జరిగే రెండో వన్డే భారత మహిళలకు సవాల్‌గా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించినా ఫలితం లేకుండా పోయింది. ఆస్ట్రేలియా బ్యాటర్లు సమష్టిగా రాణించడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆడాలనే పట్టుదలతో భారత్ ఉంది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యస్తిక భాటియా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్, జెమీమా రోడ్రిగ్స్,పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ తదితరులతో భారత బ్యాటింగ్ బలంగా ఉంది.

తొలి వన్డేలో రాణించిన రోడ్రిగ్స్, వస్త్రాకర్‌లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. మంధాన, షఫాలీ, హర్మన్ తదితరులు తమ బ్యాట్‌ను ఝులిపిస్తే ఈ మ్యాచ్‌లో కూడా భారత్‌కు మెరుగైన స్కోరు ఖాయం. అయితే ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును ఓడించాలంటే సర్వం ఒడ్డి పోరాడాల్సిన పరిస్థితి భారత్‌కు నెలకొంది. ఇందులో ఎంతవరకు సఫలమవుతుందో వేచి చూడాల్సిందే. ఇక ఆస్ట్రేలియా టీమ్‌లో అలీసా హీలీ, లిఛ్‌ఫీల్డ్, ఎలిసే పేరి, బేథ్ మూనీ, మెక్‌గ్రాత్, గార్డ్‌నర్, సదర్లాండ్ వంటి మ్యాచ్ విన్నర్ బ్యాటర్లు ఉన్నారు. అంతేగాక జొనాసెన్, షూట్, బ్రౌన్, హీథర్ గ్రామ్‌లతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీంతో ఆ మ్యాచ్‌లో కూడా కంగారూలు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News