Wednesday, January 22, 2025

ఆసియా బ్యాడ్మింటన్ ఫైనల్లో భారత్

- Advertisement -
- Advertisement -

షా ఆలం (మలేసియా): ప్రతిష్ఠాత్మకమైన ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళా జట్టు ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించింది. ఆసియా బ్యాడ్మింటన్ మహిళల టీమ్ విభాగంలో భారత్ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో భారత జట్టు 32 తేడాతో పటిష్టమైన జపాన్‌ను మట్టికరిపించింది. ఈ క్రమంలో రజత పతకాన్ని ఖాయం చేసుకుంది. హోరాహోరీగా సాగిన పోరులో భారత జట్టు అసాధారణ పోరాట పటిమతో విజయాన్ని అందుకుంది. తొలి సింగిల్స్‌లో భారత్‌కు షాక్ తగిలింది. భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు తొలి సింగిల్స్‌లో ఓటమి పాలైంది. జపాన్ షట్లర్ ఒహోరి 21-13, 22-20 తేడాతో సింధును ఓడించింది.

అయితే మహిళల డబుల్స్‌లో త్రిసాగాయత్రీ గోపిచంద్ జంట విజయం సాధించింది. మత్సుయమచిహారు షిదతో జరిగిన పోరులో త్రిసా జంట 21-17, 16-21, 22-20 తేడాతో జయభేరి మోగించింది. తర్వాత జరిగిన రెండో సింగిల్స్‌లో నొజోమి ఒకుహర 21-17, 21-14తో భారత షట్లర్ అష్మితాపై విజయం సాధించింది. దీంతో జపాన్ 21 ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఈ దశలో కీలకమైన రెండో డబుల్స్‌లో సింధుఅశ్విని పొన్నప్ప జోడీ విజయం సాధించి జపాన్ ఆధిక్యాన్ని 22కు తగ్గించింది. ఇక చివరి సింగిల్స్‌లో భారత యువ షట్లర్ అనమోల్ 21-14, 21-11 తేడాతో జపాన్ షట్లర్ నత్సుకి నిదైరాను ఓడించింది. దీంతో భారత్ 32 ఆధిక్యంతో టైటిల్ పోరుకు దూసుకెళ్లింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News