ముంబై: న్యూజిలాండ్ గడ్డపై జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టు బిసిసిఐ ఎంపిక చేసింది. టీమిండియా కెప్టెన్‌గా సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్‌ను ఎంపిక చేశారు. వైస్ కెప్టెన్సీ బాధ్యతలను హర్మన్‌ప్రీత్ కౌర్‌కు అప్పగించారు. ఇక మార్చి 4 నుంచి న్యూజిలాండ్ వేదికగా మహిళల ప్రపంచకప్ జరుగనుంది. భారత్ తన తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడనుంది. మార్చి ఆరున ఈ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత న్యూజిలాండ్, వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్లతో భారత్ గ్రూప్ దశలో తలపడుతుంది. ఇక ప్రపంచకప్ వంటి కీలక టోర్నీకి స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ఎంపిక చేయక పోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కొంతకాలంగా భారత క్రికెట్‌లో రోడ్రిగ్స్ విధ్వంసక బ్యాటర్‌గా కొనసాగుతోంది. ఆమెతో పాటు మరో స్టార్ ఆల్‌రౌండర్ శిఖా పాండేను కూడా ప్రపంచకప్‌కు ఎంపిక చేయలేదు. ఇదిలావుండగా ప్రపంచకప్‌కు ముందు భారత మహిళా జట్టు న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆడనుంది. ఈ సిరీస్‌లో కూడా ఇదే జట్టు పాల్గొంటుంది. ఫిబ్రవరి 11 నుంచి ఈ సిరీస్ జరుగుతుంది.
జట్టు వివరాలు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలి వర్మ, యాస్తిక, దీప్తి, రిచా ఘోష్, గోస్వామి,పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, పూనమ్ కౌర్, రాజేశ్వరి, తానియా, స్నేహ రాణా, రేణుకా సింగ్.
India Women Squad for ODI World Cup 2022