- Advertisement -
వెస్టిండీస్‌తో గురువారం జరిగిన, మూడో చివరి టి20లో భారత మహిళా జట్టు 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 21తో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన 47 బంతుల్లోనే 13 ఫోర్లు ఒక సిక్స్‌తో 77 పరుగులు చేసింది.
జెమీమా రోడ్రిగ్స్ (39), రఘ్వి బిస్త్ 31(నాటౌట్) తమవంతు పాత్ర పోషించారు. ఇక విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన వికెట్ కీపర్ రిచా ఘోష్ 21 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 54 పరుగులు చేసింది. దీంతో భారత్ రికార్డు స్కోరును నమోదు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేసి పరాజయం చవిచూసింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ నాలుగు వికెట్లు తీసింది.
- Advertisement -