Monday, January 20, 2025

భారత మహిళా జట్ల ఎంపిక

- Advertisement -
- Advertisement -

India women’s team for England tour announced

 

ముంబై: ఇంగ్లండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లో పాల్గొనే భారత మహిళా క్రికెట్ జట్టును శుక్రవారం ప్రకటించారు. సెప్టెంబర్‌లో ఇంగ్లండ్‌లో పర్యటించే భారత జట్టు మూడు టి20లు, మరో మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లో పాల్గొనే భారత జట్లను సెలెక్టర్లు ఎంపిక చేశారు. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. వెటరన్ బౌలర్ జులన్ గోస్వామికి వన్డే జట్టులో చోటు లభించింది. జెమీమా రోడ్రిగ్స్ కూడా సిరీస్‌కు ఎంపికైంది. కె.పి.నవ్‌గిర్ తొలిసారి టీమిండియాకు ఎంపికైంది. ఇక సిరీస్ కోసం రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేశారు. ఐసిసి ఎఫ్‌టిపిలో భాగంగా ఈ సిరీస్ జరుగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News