Saturday, November 16, 2024

పారాలింపిక్స్‌లో భారత్ జోరు.. రికార్డు స్థాయిలో పతకాలు

- Advertisement -
- Advertisement -

పారిస్: పారాలింపిక్ 2024లో భారత్ రికార్డు స్థాయి పతకాలను సొంతం చేసుకుంది. ఆదివారం మహిళల కయాక్ 200మీ. విభాగంలో పూజా ఓజా ఓటమితో పారా గేమ్స్‌లో భారత్ పోరు ముగిసింది. 25 పతకాలు లక్ష్యంగా బరిలోకి దిగిన భారత అథ్లెట్లు 4 ఎక్కువగా పతకాలు సాధించి అద్భుతం చేశారు. ఈ పారాలింపిక్స్‌లో భారత్ మునుపెన్నడు సాధించని సంఖ్యలో 29 పతకాలతో సత్తా చాటింది.

టోక్యోలో 19 పతకాలతో సరిపెట్టుకున్న భారత్ ఈసారి 10 పతకాలు ఎక్కువ గెలుచుకుని రికార్డు పతకాలను సాధించి 18వ స్థానంలో నిలిచింది. వీటిలో ఈసారి 7 బంగారు పతకాలు ఉండగా.. 9 వెండి, 13 కాంస్య పతకాలు భారత్ ఖాతాలో వచ్చి చేరాయి. భారత్ పారాలంపిక్స్‌లో అద్భుతమైన ఆటతీరును కనబరిచింది. స్విట్జర్లాండ్, దక్షిణ కొరియా, బెల్జియం, అర్జెంటీనా వంటి దేశాలను ఓడించింది. ఈ దేశాలను వెక్కు నెట్టి ముందువరుసలోకి దూసుకొచ్చింది.

పతకాలు సాధించింది వీరే..

అవని లేఖరా(షూటింగ్)           స్వర్ణం
నితేష్ కుమార్(బ్యాడ్మింటన్)      స్వర్ణం
సుమిత్ అంటిల్(అథ్లెటిక్స్)        స్వర్ణం
హర్విందర్ సింగ్-(ఆర్చరీ)         స్వర్ణం
ధరంబీర్ సింగ్(అథ్లెటిక్స్)          స్వర్ణం
ప్రవీణ్ కుమార్(అథ్లెటిక్స్)         స్వర్ణం
నవదీప్ సింగ్(అథ్లెటిక్స్)          స్వర్ణం
మోనాఆగర్వాల్(షూటింగ్)        కాంస్యం
ప్రీతిపాల్(అథ్లెటిక్స్)               కాంస్యం
రుబీనా ఫ్రాన్సిస్(షూటింగ్)        కాంస్యం
మనీశా రామదాస్(బ్యాడ్మింటన్)  కాంస్యం
రాకేశ్ కుమార్ శీతల్‌దేవి(ఆర్చరీ) కాంస్యం
దీప్తి జీవాంజీ(అథ్లెటిక్స్)           కాంస్యం
మరియప్పన్ తంగవేలు(అథ్లెటిక్స్)- కాంస్యం
గుర్జర్ సుందర్ సింగ్(అథ్లెటిక్స్)    కాంస్యం
కపిల్ పర్మార్(జూడో)               కాంస్యం
హొకాటో హోటోజీ సెమా(అథ్లెటిక్స్) కాంస్యం
సిమ్రాన్(అథ్లెటిక్స్)                 కాంస్యం
ప్రీతిపాల్(అథ్లెటిక్స్)                కాంస్యం
మనీశ్ నర్వాల్(షూటింగ్)         రజతం
నిషాద్ కుమార్(అథ్లెటిక్స్)         రజతం
యోగేశ్ కతునియా(అథ్లెటిక్స్)     రజతం
తులసిమతి మురుగేశన్(బ్యాడ్మింటన్) రజతం
సుహాస్ యతిరాజ్(బ్యాడ్మింటన్)   రజతం
శరద్ కుమార్(అథ్లెటిక్స్)           రజతం
ఆర్జీత్ సింగ్(అథ్లెటిక్స్)             రజతం
సచిన్ ఖిలారీ(అథ్లెటిక్స్)           రజతం
ప్రణవ్(అథ్లెటిక్స్)                   రజతం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News