ట్రినిడాడ్: క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డేలో భారత్ జట్టు రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 311 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.4 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. భారత్ జట్టు 49.4 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 312 పరుగులు చేసింది. అక్షర పటేల్ 35 బంతుల్లో 64 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. నాలుగో వికెట్‌పై సంజూ సామ్సన్-శ్రేయస్ అయ్యర్ 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత బ్యాట్స్‌మెన్లు అక్షర పటేల్ (64) నాటౌట్, శ్రేయస్ అయ్యర్ (63), సంజూ శామ్సన్ (54), శుభ్‌మన్ గిల్ (43), దీపక్ హుడా(33), శిఖర్ ధావన్ (13), అవేశ్ ఖాన్ (10), సూర్యాకుమార్ యాదవ్ (09), శార్థూల్ టాకూర్ (03), సిరాజ్ (01) నాటౌట్ పరుగులు చేసి ఔటయ్యారు. ఒక వికెట్ తీసి 64 పరుగులు చేసిన అక్షర్ పటేల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. టీమిండియా 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. విండీస్ బౌలర్లలో జోషెప్, మేయర్స్ చెరో రెండు వికెట్లు తీయగా సీల్స్, షెఫార్డ్, అకీల్ హుస్సేన్ తలో ఒక వికెట్ తీశారు.
రెండో వన్డే భారత్‌దే …. సిరీస్ కైవసం…
- Advertisement -
- Advertisement -
- Advertisement -