Friday, November 22, 2024

భారత్‌కు కాంస్యం

- Advertisement -
- Advertisement -

India won bronze medal at Asian Champions Trophy Hockey Tournament

ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ

ఢాకా: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత పురుషుల జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. బుధవారం కాంస్యం కోసం జరిగిన పోరులో భారత్ 43 గోల్స్ తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్, పాకిస్థాన్ జట్లు కనీసం ఫైనల్‌కు కూడా చేరుకోలేక పోయాయి. సెమీస్‌లో దక్షిణ కొరియా చేతిలో పాకిస్థాన్ ఓటమి పాలుకాగా, భారత్‌పై జపాన్ సంచలన విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. దీంతో చిరకాల ప్రత్యర్థులు భారత్‌పాకిస్థాన్ కాంస్యం కోసం పోటీ పడాల్సి వచ్చింది. ఇక ఈ పోరులో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. చివరి వరకు నువ్వానేనా అన్నట్టు సాగిన సమరంలో భారత్ జయకేతనం ఎగుర వేసింది. ఆరంభంలో భారత్ పైచేయి సాధించింది. తొలి నిమిషంలో భారత్ గోల్‌ను నమోదు చేసింది. హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంలో సఫలమయ్యాడు.

ఆ తర్వాత కూడా భారత్‌కు మూడు పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. అయితే వీటిని గోల్‌గా మలచడంలో భారత ఆటగాళ్లు సఫలం కాలేదు. అయితే 11వ నిమిషంలో పాకిస్థాన్ స్కోరును సమం చేసింది. అఫ్రొజ్ ఈ గోల్‌ను సాధించాడు. ఇక మూడో క్వార్టర్‌లో పాకిస్థాన్ రెండో గోల్‌ను నమోదు చేసింది. అబ్దుల్ చేసిన ఈ గోల్‌తో పాకిస్థాన్ 21 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మరోవైపు 45వ నిమిషంలో భారత్ స్కోరును సమం చేసింది. సుమిత్ ఈ గోల్‌ను సాధించాడు. ఇక వరుణ్ కుమార్ (53వ), ఆకాశ్ దీప్ (57వ నిమిషం)లో గోల్ చేయడంతో భారత్ 42 ఆధిక్యాన్ని అందుకుంది. చివర్లో పాకిస్థాన్ ఒక గోల్ చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరి వరకు ఆధాక్యాన్ని కాపాడుకున్న భారత్ 43 గోల్స్ తేడాతో మ్యాచ్‌ను సొంతం చేసుకుని కాంస్య పతకాన్ని దక్కించుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News