Sunday, January 26, 2025

తిలక్ వర్మ విధ్వంసం.. మూడో టీ20లో భారత్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

సెంచూరియన్: సౌతాఫ్రికాతో బుధవారం జరిగిన మూడో టి20లో టీమిండియా విజయం సాధించింది. భారత్ విధించిన 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 11 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఓపెనర్ సంజు శాంసన్ ఇన్నింగ్స్ రెండో బంతికే పెవిలియన్ చేరాడు. అప్పటికీ అతను ఖాతాను కూడా తెరవలేదు.

అయితే వన్‌డౌన్‌లో వచ్చిన తిలక్‌వర్మతో కలిసి మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించారు. చెలరేగి ఆడిన అభిషేక్ శర్మ 25 బంతుల్లోనే ఐదు భారీ సిక్సర్లు, 3 ఫోర్లతో 50 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రెండో వికెట్‌కు 107 పరుగులు జోడించాడు. మరోవైపు తిలక్ వర్మ విధ్వంసక శతకంతో చెలరేగి పోయాడు. సౌతాఫ్రికా బౌలర్లను హడలెత్తించిన తిలక్ 56 బంతుల్లోనే ఏడు భారీ సిక్సర్లు, 8 ఫోర్లతో 107 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కాగా, కెప్టెన్ సూర్యకుమార్(1), రింకు సింగ్(8), హార్దిక్ (18)లు నిరాశ పరిచాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News