Friday, December 20, 2024

తిలక్, సంజు విధ్వంసం.. నాలుగో టీ20 భారత్ రికార్డు విజయం

- Advertisement -
- Advertisement -

జోహెన్నస్‌బర్గ్: సౌతాఫ్రికాతో శుక్రవారం జరిగిన నాలుగో, చివరి టి20లో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత్ విధించిన 284 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాప్రికా జట్టు 18.2 ఓవర్లలో 148 పరుగులకే చేతులెత్తేసింది. సఫారీ బ్యాట్స్ మెన్లలో స్టబ్స్(43), డేవిడ్ మిల్లర్(36), మార్క్ జాన్సెన్(29)లు రాణించారు. టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమవ్వడంతో సౌతాఫ్రికా జట్టుకు ఓటమి తప్పలేదు. దీంతో టీమిండియా 135 పరుగులు భారీ తేడాతో రికార్డు విజయాన్ని నమోదు చేసింది. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ మూడు కీలక వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ లు చెరో రెండు వికెట్లు, పాండ్యా, రమన్ దీప్ సింగ్, రవి బిష్నోయిలు తలో వికెట్ తీశారు. దీంతో నాలుగు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను భారత్ 3-1తో గెలుచుకుంది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 283 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. ఓపెనర్ సంజు శాంసన్, వన్‌డౌన్‌లో వచ్చిన హైదరాబాదీ యువ సంచలనం తిలక్‌వర్మలు అజేయ శతకాలతో చెలరేగి పోయారు. ఈ క్రమంలో రెండో వికెట్‌కు అభేద్యంగా 210 పరుగుల జోడించి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మలు కళ్లు చెదిరే ఆరంభాన్ని అందించారు. వరుసగా రెండు మ్యాచుల్లో డకౌట్‌గా వెనుదిరిగిన సంజు ఈసారి ఆరంభం నుంచే చెలరేగి ఆడాడు. ధాటిగా బ్యాటింగ్ చేసిన అభిషేక్ 18 బంతుల్లోనే 4 సిక్సర్లు, 2 ఫోర్లతో 36 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన తిలక్‌వర్మతో కలిసి సంజు రికార్డు పార్ట్‌నర్‌షిప్‌ను నమోదు చేశాడు. ఇటు సంజు, అటు తిలక్ సౌతాఫ్రికా బౌలర్ల ఊచకోత కోశారు. వీరిని కట్టడి చేయడంలో ఆతిథ్య జట్టు బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన తిలక్ 47 బంతుల్లోనే 10 సిక్సర్లు, 9 ఫోర్లతో అజేయంగా 120 పరుగులు చేశాడు. మరోవైపు సంజు 56 బంతుల్లో 9 సిక్స్‌లు, ఆరు ఫోర్లతో 109 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత్ స్కోరు 283 పరుగులకు చేరింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News