Friday, November 22, 2024

రాణించిన సూర్య, భువీ

- Advertisement -
- Advertisement -

India won by 38 runs against Sri Lanka in 1st T20

తొలి టి20 మ్యాచ్‌లో లంకపై భారత్ ఘన విజయం

కొలంబో: శ్రీలంకతో ఆదివారం ఇక్కడ జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో భారత్ 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 165 పరుగుల లక్షాన్ని ఛేదించడంలో లంక బ్యాట్స్‌మెన్ ఆదినుంచి తడబడుతూనే వచ్చారు. ఒక్క అసలంక మాత్రమే దూకుడుగా ఆడి 44 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్‌మెన్ అందరూ భారత బౌలర్లను ఎదుర్కోలేక వెంటవెంటనే పెవిఇలయన్ చేరారు. దీంతో ఆ జట్టు 18.3 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1 0 ఆధిక్యత సాధించింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ కేవలం 22 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.
రాణించిన సూర్యకుమార్, ధావన్..
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవరలో 5 వికెట్ల నషానికి164 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీషా తొలి ఓవర్ తొలిబంతికే ఔటయినప్పటికీ మరో ఓపెనర్, కెప్టెన్ శిఖర్ ధావన్ (36 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 46), సూర్యకుమార్ యాదవ్(34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50) రాణించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 62 కీలక పరుగులు జోడించారు. అయితే ధాటిగా ఆడే క్రమంలో ధావన్ అర్ధ సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అయితే ఆ వెంటనే ఔటయ్యాడు. హార్దిక్ పాండ్య నిరాశపర్చగా, సంజు శాంసన్ (27 బంతుల్లో 20 పరుగులు) పరవాలేదనిపించాడు. చివర్లో ఇషాన్ కిషన్ (20 పరుగులునాటౌట్) కాస్త వేగంగా పరుగులు చేయడంతో భారత్ ఓ మోస్తరు స్కోరు చేసింది.లంక బౌలర్లలో చమీరా, హసరంగె చెరి రెండు వికెట్లు పడగొట్టగా, కరుణరత్నెకు ఒక వికెట్ దక్కింది.ఈ మ్యాచ్‌లో టీమిండియా తరఫున ఓపెనర్ పృథ్వీషా, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టి 20 అరంగేట్రం చేశారు. అయితే పృథ్వీషా అరంగేట్రం మ్యాచ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయి గోల్డెన్ డక్ అపప్రథను మూటగట్టుకున్నాడు.

India won by 38 runs against Sri Lanka in 1st T20

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News