Wednesday, January 22, 2025

భారత్-దక్షిణాఫ్రికా టెస్టు మ్యాచ్: 92ఏళ్ల రికార్డు బ్రేక్..

- Advertisement -
- Advertisement -

కేఫ్‌టౌన్ : సఫారీల గడ్డపై భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కేఫ్‌టౌన్ వేదికగా జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. దీంతో సౌతాఫ్రికా పర్యటనను టీమిండియా చారిత్రాత్మక విజయంతో ముగించినట్లైంది. ఇక ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది.

తక్కువ బంతుల్లోనే ముగిసి టెస్టు..

107 ఓవర్లలోనే ఈ మ్యాచ్ ఫలితం తేలింది. 92 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది ఈ మ్యాచ్. అతి తక్కువ బంతులు బౌలింగ్ చేసిన టెస్ట్ మ్యాచ్‌గా ఈ టెస్టు రికార్డుల్లోకి ఎక్కింది. 1932లో మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా తలపడిన టెస్టు మ్యాచ్ 656(109.3 ఓవర్లు) బంతుల్లోనే ముగిసింది. ఇప్పటి వరకు ఇదే రికార్డుగా ఉండగా.. తాజా భారత్, సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్ దానిని బ్రేక్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News