Friday, November 22, 2024

టీమిండియాకు ఓదార్పు

- Advertisement -
- Advertisement -

T20 World Cup: India Needs 133 runs to win against NAM

దుబాయి: నామమాత్రంగా మిగిలిన ప్రపంచకప్ సూపర్12 చివరి మ్యాచ్‌లో టీమిండియా 9 వికెట్ల తేడాతో నమీబియాను చిత్తు చేసింది. భారత్‌కు ఇది వరుసగా మూడో విజయం కాగా, కెప్టెన్‌గా విరాట్ కోహ్లికి ఇదే చివరి టి20 మ్యాచ్ కావడం మరో విశేషం. ముందుగా బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 15.2 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. స్వల్ప లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, కెఎల్.రాహుల్ మరోసారి శుభారంభం అందించారు. రాహుల్ ఆత్మరక్షణతో బ్యాటింగ్ చేయగా రోహిత్ దూకుడును ప్రదర్శించాడు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. తన మార్క్ షాట్లతో అలరించిన రోహిత్ స్కోరును పరిగెత్తించాడు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు వేగం తగ్గకుండా చూశాడు. ధాటిగా ఆడిన రోహిత్ 37బంతుల్లోనే 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 86 పరుగులు జోడించి జట్టును పటిష్టస్థితికి చేర్చాడు. తర్వాత వచ్చిన సూర్యకుమార్‌తో కలిసి రాహుల్ మిగిలిన పనిని పూర్తి చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ 36 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 54 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ 25 (నాటౌట్) తనవంతు పాత్ర పోషించాడు. ఇక గెలుపుతో గ్రూప్2లో భారత్ మూడో స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి.
జడేజా మాయ..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియాకు ఓపెనర్లు స్టెఫాన్ బార్డ్, మైఖేల్ వాన్ లింగెన్ కాస్త మెరుగైన ఆరంభాన్ని అందించారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగానే ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఓపెనర్లు కుదురుగా ఆడడంతో నమీబియా మంచి ఆరంభం ఖాయ మనిపించింది. కానీ రెండు ఫోర్లతో 14 పరుగులు చేసిన లింగెన్‌ను బుమ్రా వెనక్కి పంపాడు. దీంతో 33 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే వన్‌డౌన్‌లో వచ్చిన క్రెగ్ విలియమ్స్ (0) కూడా ఔటయ్యా డు. అతన్ని జడేజా ఔట్ చేశాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన విలియమ్స్ స్టంపౌటయ్యాడు. కొద్ది సేపటికే మరో ఓపెనర్ బార్డ్ కూడా ఔటయ్యాడు. ఒక ఫోర్, సిక్స్ తో 21 పరుగులు చేసిన బార్డ్‌ను జడేజా పెవిలియన్ బాట పట్టించాడు. ఆ వెంటనే ఈటన్ (5) కూడా వెనుదిరిగా డు. ఈ వికెట్ అశ్విన్ ఖాతాలోకి వెళ్లింది. దీంతో నమీబి యా 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వీస్, కెప్టెన్ ఎరాస్‌మస్ కొద్ది సేపు వికెట్ల పతనా న్ని అడ్డుకున్నారు. అయితే 20 బంతుల్లో 12 పరుగులు చేసి ఎరాస్‌మస్‌ను అశ్విన్ వెనక్కి పంపాడు. ఆ వెంటనే స్మిత్ (9) కూడా పెవిలియన్ చేరాడు. అతన్ని జడేజా ఔట్ చేశాడు. ఇక వికెట్ కీపర్ జానె గ్రీన్ (0)ను అశ్విన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. అతను కనీసం ఖాతా కూడా తెరవలేక పోయాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన వీస్ రెండు ఫోర్లతో 26 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్ చేరా డు. ఇక చివర్లో ఫ్రిలింక్, ట్రంపల్‌మెన్ కాస్త ధాటిగా ఆడడంతో నమీబియా స్కోరు 8 వికెట్ల నష్టానికి 132 పరుగులకు చేరింది. ఫ్రిలింక్ 15, ట్రంపల్‌మెన్ 13 పరుగులతో అజేయంగా నిలిచారు. భారత బౌలర్లలో అశ్విన్, జడేజా మూడేసి వికెట్లు పడగొట్టారు. బుమ్రాకు రెండు రెండు వికెట్లు దక్కాయి.

India won by 9 wickets against NAM

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News