Monday, December 23, 2024

ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్.. ఇషా ఖాతాలో మరో స్వర్ణం

- Advertisement -
- Advertisement -

India won gold medal at Junior World Cup Shooting Championship

25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు గోల్డ్

సూల్ (జర్మనీ): ఇక్కడ జరుగుతున్న జూనియర్ ప్రపంచ కప్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ మరో స్వర్ణ పతకం సాధించింది. మంగళవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో భారత్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. మను బాకర్, రిథమ్ సంగ్వాన్, ఇషా సింగ్‌లతో కూడిన భారత టీమ్ ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణం దక్కించుకుంది. మిఛిలా, వనెసా, మియాలతో కూడిన జర్మనీ జట్టును భారత్ ఫైనల్లో ఓడించింది. ఈ మ్యాచ్‌లో భారత బృందం పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థి టీమ్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించింది. అసాధారణ ఆటను కనబరిచిన భారత టీమ్ 162 తేడాతో జర్మనీని చిత్తు చేసి స్వర్ణం సాధించింది. మరోవైపు 50 మీటర్ల రైఫీల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో భారత్‌కు రజతం లభించింది. పంకజ్‌సిఫ్ట్ కౌర్ సమ్రాలతో కూడిన భారత జట్టు ఫైనల్లో ఓటమి పాలైంది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో పోలండ్‌కు చెందిన మిఛాల్ చొంజొస్కిజూలియా పియోట్రొస్కా జంట చేతిలో భారత్ కంగుతిన్నది. ఆసక్తికరంగా సాగిన పోరులో పోలండ్ టీమ్ 16-12 పాయింట్ల తేడాతో భారత్‌ను ఓడించి స్వర్ణం సొతం చేసుకుంది. కాగా ఈ పోటీల్లో భారత్ 28 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 11 స్వర్ణాలు, 13 రజతాలు, మరో 4 కాంస్య పతకాలను భారత్ ఇప్పటి వరకు దక్కించుకుంది. ఇక శుక్రవారం ఈ పోటీలు ముగుస్తాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News