Friday, December 20, 2024

World cup: భారత్ బోణీ

- Advertisement -
- Advertisement -

అర్ధ శతకాలతో రాణించిన కోహ్లీ, రాహుల్
6 వికెట్ల తేడాతో ఆసీస్ చిత్తు

చెన్నై: వన్డే ప్రపంచకప్‌లో భారత్ బోణీ కొట్టింది. విరాట్ కోహ్లీ 85 (116 బంతుల్లో 6×6), కెఎల్ రాహుల్ 97 (115 బంతుల్లో 2×8, 6×2) బాధ్యాతాయుతమైన ఇన్నింగ్స్‌లో భారత్‌ను గట్టెక్కించారు. తక్కువ లక్ష ఛేదనలో తడబడినా 9 ఓవర్లు మిగిలుండగానే విజయానందుకొని శుభారంభం చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత భారత బౌలర్లు అదరగొట్టడంతో ఆసీస్ 49.3 ఓవర్లలో 199 పరుగులకు కుప్పకూలింది. ఈ స్వల్ప టార్గెట్‌ను 41.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ (0), ఇషాన్ కిషన్ (0), శ్రేయస్ అయ్యర్ (0) వరుసగా పెవిలియన్ బాటపట్టడంతో రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత్. ఇక మూడు వికెట్లు కోల్పోయినా కోహ్లీ, రాహుల్ చాలా బాధ్యతాగా సింగిల్స్ తీస్తూ, అడపాదడపా బౌండరీలకు తరలిస్తూ 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ 3, మిచెల్ స్టార్క్ ఒక వికెట్ పడగొట్టారు.

భారత స్పిన్నర్లు అదరహో

భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు దుమ్మురేపారు. రవీంద్ర జడేజా(3/28) తీన్మార్ బౌలింగ్‌కు కుల్దీప్ యాదవ్(2/42), జస్‌ప్రీత్ బుమ్రా(2/35)లు చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 199 పరుగులకే చాపచుట్టేసింది. ఆసీస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ 46 (71 బంతుల్లో 5×4), డేవిడ్ వార్నర్ 41 (52 బంతుల్లో 6×4) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చివర్లో మిచెల్ స్టార్క్ 28 (35 బంతుల్లో 2×4, 6×1) పరుగులు చేయడంతో ఆసీస్ ఆమాత్రం స్కోరు చేయగలిగింది. ఇక భారత బౌలింగ్ సమష్టిగా రాణించడంతో కంగారులను తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగారు.

ఆసీస్‌ను ఆదుకున్న ఓపెనర్లు..

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ప్రారంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే డేంజరస్ బ్యాటర్ మిచెల్ మార్ష్(0) డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్‌తో మిచెల్ మార్ష్ క్రీజు వదిలాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన స్మిత్‌తో కలిసి డేవిడ్ వార్నర్ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించడంతో తొలి పవర్ ప్లేలో ఆసీస్ వికెట్ నష్టానికి 43 పరుగులే చేసింది. స్మిత్ డిఫెన్స్‌కే పరిమితంకాగా వార్నర్ దూకుడుగా అందివచ్చిన బాల్‌ను బౌండరీకి తరించాడు. ఇక హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో వార్నర్‌కు లైఫ్ లభించింది. అతనిచ్చిన రిటర్న్ క్యాచ్‌ను హార్దిక్ అందుకోలేకపోయాడు. ఈ అవకాశంతో మరింత చెలరేగిన అతను వేగంగా పరుగులు రాబట్టాడు. క్రీజులో పాతుకుపోయిన వార్నర్‌ను కుల్దీప్ యాదవ్ బోల్తా కొట్టించాడు.

కళ్లు చెదిరే క్యాచ్‌తో వార్నర్‌ను ఔట్ చేశాడు. దాంతో రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మార్నస్ లబుషేన్‌తో కలిసి స్మిత్ నిదానంగా ఆడాడు. జిడ్డు బ్యాటింగ్‌తో బౌలర్లతో పాటు అభిమానులను విసిగించాడు. చివరకు రవీంద్ర జడేజా స్టన్నింగ్ డెలివరీకి క్లీన్ బౌల్ అయ్యాడు. స్మిత్ ఔటైన వెంటనే ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. జడేజా తన మరుసటి ఓవర్‌లో లబుషేన్(27), అలెక్స్ క్యారీ(0)లను పెవిలియన్ చేర్చాడు. గ్లేన్ మ్యాక్స్‌వెల్(15)ను కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్ చేయగా.. కామెరూన్ గ్రీన్(8)ను అశ్విన్ ఔట్ చేశాడు. దాంతో ఆసీస్ 140 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టల్లో పడింది. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. ఓ సిక్స్, బౌండరీతో దూకుడు కనబర్చిన అతన్ని బుమ్రా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత మిచెల్ స్టార్క్ ధాటిగా ఆడే ప్రయత్నం చేయగా.. జంపాను హార్దిక్ పాండ్యా ఔట్ చేశాడు. చివరి వికెట్‌గా స్టార్క్‌ను సిరాజ్ ఔట్ చేయడంతో ఆసీస్ బ్యాటింగ్ ముగిసింది.

కుల్దీప్ కళ్లు చెదిరే క్యాచ్..

మొదట బుమ్రా బౌలింగ్‌లో అద్భుతమైన డైవింగ్ క్యాచ్‌తో మిచెల్ మార్ష్‌ను కోహ్లీ అవుట్ చేయగా.. కుల్‌దీప్ యాదవ్ డేంజరస్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్‌ను కళ్లు చెదిరే రిటర్న్ ఔట్ చేశాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ ఆసీస్ ఓపెనర్ వార్నర్‌ను అవుట్ చేశాడు. కుల్దీప్ వేసిన ఫుల్ లెంగ్త్ బంతిని వార్నర్ నేరుగా కొట్టబోయాడు. కానీ బంతిని వార్నర్ అనుకున్నంత బలంగా కొట్టలేకపోవడంతో బంతి తక్కువ ఎత్తులో కుల్దీప్ వైపు దూసుకెళ్లింది. ఇది గమనించిన కుల్దీప్ ఏ మాత్రం తడబడకుండా ఒడిసి పట్టడంతో వార్నర్ షాక్‌తో పెవిలియన్ చేరాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News