Wednesday, January 22, 2025

సంజు సెంచరీ… సిరీస్ టీమిండియాదే…

- Advertisement -
- Advertisement -

పార్ల్: భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. భారత జట్టు 2-1 తేడాతో సిరీస్‌ను గెలుచుకుంది. మూడు వన్డేల్లో ఘన విజయం సాధించడంతో సిరీస్ భారత వశమైంది. సంజు శామ్సన్ సెంచరీ చేయడంతో భారత జట్టు 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 297 పరుగుల లక్ష్యాన్ని సపారీల ముందు ఉంచింది. భారత బ్యాట్స్‌మెన్లు సంజూ(108), తిలక్ వర్మ(52), రింకు సింగ్(38), రజత్ పాటీదర్(22), రాహుల్(21), వాషింగ్టన్ సుందర్(14), సుదర్శన్(10) పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్ మెన్లు సింగల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

298 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 45.5 ఓవర్లలో పది వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో స్వదేశంలో వన్డే సిరీస్‌ను కొల్పోయింది. సఫారీ ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చినప్పటికి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు త్వరగా ఔట్ కావడంతో సిరీస్ కోల్పోవలసి వచ్చింది. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన సంజూ శామ్సన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా, ఈ సిరీస్‌లో పది వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించిన అర్షదీప్ సింగ్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News